
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.ఆక
ఎస్పీ పల్లెనిద్ర
శెట్టూరు/అనంతపురం: శెట్టూరు మండలంలోని అనుంపల్లి గ్రామంలో ఎస్పీ జగదీష్ ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. చట్టాలపై అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండాలన్నారు. నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో కర్ణాటక మద్యం విక్రయిస్తుండడంతో యువత చెడిపోతున్నారని, రోడ్లు లేవని, పొలాలకు వెళ్తున్న రైతులపై ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులు దాడి చేస్తున్నాయని, పొలాల్లో స్టార్టర్ పెట్టెలు, వైర్లు అధికంగా చోరీకి గురతున్నాయని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, సీఐ వంశీకృష్ణ, ఎస్‌ఐ రాంభూపాల్, గ్రామ సర్పంచ్ పాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
● బుధవారం ఉదయం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేసుల ఛేదనపై పలు సూచనలు చేశారు. విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. కీలక కేసుల ఛేదన, నిందితుల అరెస్ట్ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.