
పంటల సాగులో మెలకువలు అవసరం
బుక్కరాయసముద్రం: పంటల సాగులో మెలకువలు ఎంతో అవసరం అని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త మల్లేశ్వరి పేర్కొన్నారు. శనివారం మండల పరిఽధిలోని రెడ్డిపల్లి కేవీకేలో అటారి, హైదరాబాద్ ప్రిన్సిపల్ సైంటిస్టు రెడ్డికి రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, మెలుకువలు తప్పక పాటించాలన్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ ప్రాముఖ్యతను వివరించారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు పనిముట్లను అందజేశారు. కార్యక్రమంలో కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, సస్య ఉత్పత్తి శాస్త్రవేత్త శశికళ, డాక్టర్ మాధవి వెటర్నరీ శాస్త్రవేత్త, వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త చందన తదితరులు పాల్గొన్నారు.
కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి