
రైల్వే స్టేషన్‌లో యువకుడి మృతి
గుత్తి: స్థానిక రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై గురువారం అర్ధరాత్రి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం బిదనంచెర్లకు చెందిన హిటాచీ డ్రైవర్ జగదీశ్వరరెడ్డి (32)గా గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన గుత్తి రైల్వే స్టేషన్‌లో మృతి చెందినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. అనారోగ్యమే మృతికి కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.