
జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.ఆకాశం మేఘావృతమ
దుర్మార్గపు పాలనకు చరమగీతం
కూటమి సర్కారు అండతో తాడిపత్రిలో దుర్మార్గపు పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు కేతిరెడ్డి హర్షితారెడ్డి మండి పడ్డారు. సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పెద్దారెడ్డి భయపడే ప్రసక్తే లేదన్నారు. పెద్దారెడ్డికి అండగా ఉన్న కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ ద్వారా బాబు మోసాలను ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి కార్యకర్తకూ న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.
అరాచకాలకు అడ్డుకట్ట వేద్దాం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేద్దామని వైఎస్సార్‌సీపీ నేత ఫయాజ్‌బాషా అన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇళ్ల నిర్మాణాలు కూల్చివేత లాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అరాచకాలపై పోరాడుదామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామన్నారు.
అభివృద్ధి శూన్యం
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధీ జరగలేదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు, చిన్నబాబు, కళ్యాణ్‌బాబులకే జాబ్‌లు వచ్చాయి తప్ప యువతకు రాలేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారన్నారు.

జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.ఆకాశం మేఘావృతమ

జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.ఆకాశం మేఘావృతమ

జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.ఆకాశం మేఘావృతమ