
జిల్లా అంతటా ఆదివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆ
అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. టౌ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన మేరకు వివరాలు.. కడపకు చెందిన మునయ్య కుమారుడు సుంకర మునిశేఖర్ (50) ఆదివారం అరవింద నగర్‌లో పరిటాల రవి ఇంటి సమీపంలోని సాయి కొరల్ కౌంటీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న తన స్నేహితుడు జయప్రకాష్ నాయుడును కలవడానికి వచ్చాడు. అయితే, తాను ఊరికి వెళ్తున్నానని చెప్పి జయప్రకాష్ నాయుడు వెళ్లిపోగా.. మునిశేఖర్ అక్కడే ఉన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో అపార్ట్ మెంట్ 5వ ఫ్లోర్ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని సీఐ శ్రీకాంత్‌యాదవ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, మునిశేఖర్ గతంలో సోషల్ వెల్ఫేర్ విభాగంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసినట్లు తెలిసింది. స్థానిక అశోక్‌నగర్‌లోని మినర్వా స్కూల్ సమీపంలో ఓ గదిలో అద్దెకున్నట్లు సమాచారం. భార్య లక్ష్మితో 2015 నుంచి మునిశేఖర్ విడిగా ఉంటున్నాడు. భార్య, పిల్లలు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.