ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
శింగనమల: నిదనవాడ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. వారం రోజులుగా జేసీబీతో తవ్వి ట్రాక్టర్లతో బయటకు తరలించి డంప్ చేసి, అక్కడి నుంచి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అధికారులకు విషయం తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా కదిలి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నారు. టిప్పరు, జేసీబీ, ట్రాక్టరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
● ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు మండలంలో దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.


