
● అ‘పూర్వ’ సమ్మేళనం
పామిడి: స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 విద్యాసంవత్సంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి అల్లరి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులు ఆత్మానంద, వెంకటరమణప్ప, గురురాజమూర్తిని ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అమరేంద్ర, తిరుపాలు, పీడీ గోపాల్, హెచ్.నారాయణరావు, గోపాల్‌రెడ్డి, నగేష్, ఎంపీ శ్రీనివాసులు, రాజశేఖర్, రఘునాథశర్మ నేతృత్వం వహించారు. శేషగిరి, మునిస్వామి, సతీష్‌కుమార్, శ్రీనివాసులు, సదానందబాబు, వెంకటేశ్వరరావు, పులిశేఖర్ కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు.