
నేడు తాడిపత్రిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం తాడిపత్రి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. తాడిపత్రి పట్టణ, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
40 శాతం రాయితీతో
విత్తన వేరుశనగ
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది 50,592 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించారు. కే–6తో పాటు టీసీజీఎస్–1,694, కదిరి–లేపాక్షి (కే–1,812) విత్తన రకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కే–6, టీసీజీఎస్–1,694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా అందులో 40 శాతం రూ. 3,720 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కే–1,812 రకం పూర్తి ధర రూ.8,200 కాగా రూ.3,280 రాయితీ పోనూ రైతులు రూ.4,920 చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాలు (ఒక్కోటి 30 కిలోలు) పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక.. 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు, 50 శాతం రాయితీతో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు జూన్ మొదటి వారంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 ప్రాసెసింగ్ ప్లాంట్లలో వేరుశనగ విత్తనశుద్ధి జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆర్‌ఎస్‌కేలకు విత్తన సరఫరా చేసినట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ వర్గాలు తెలిపాయి.
ఎలుగుబంట్ల హల్‌చల్
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని రోషన్ కొండ సమీపంలో ఆదివారం రెండు ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలోనే ఉరుసు ఉత్సవానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కేకలు వేయడంతో భల్లూకాలు కొండల్లోకి పారిపోయాయి. ఇటీవల కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్లు జనావాసా ల్లోకి చొరబడుతున్నాయి. రెండు రోజుల క్రితం మండల పరిధిలోని మోరేపల్లి గ్రామం వద్ద వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
‘యోగాంధ్ర’కు రిజిస్ట్రేషన్ చేసుకోండి : కలెక్టర్
అనంతపురం అర్బన్:యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఇందుకోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర–2025 క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు https://yogandhra.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

నేడు తాడిపత్రిలో ‘పరిష్కార వేదిక’

నేడు తాడిపత్రిలో ‘పరిష్కార వేదిక’

నేడు తాడిపత్రిలో ‘పరిష్కార వేదిక’