
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉక్కపోత తగ్
పోలీస్‌స్టేషన్‌కు
చేరిన కిడ్నాప్ కథ
తాడిపత్రిటౌన్: పట్టణంలో కేబుల్ ఆపరేటర్ యజమానుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో గురువారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త యాసిన్‌ను కొందరు టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డితో పాటు యాసిన్ తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తనను టీడీపీ నాయకులు ధనుంజయరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, రామాంజులరెడ్డి, బేల్దారి ప్రసాద్ కిడ్నాప్ చేసి రూములో బంధించి ఇసుప పైపులు, కట్టెలతో చావబాదారని, గురువారం రాత్రి సమయంలో వదిలేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకొన్న తనకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకొని వచ్చానని పేర్కొన్నారు. డిష్ గొడవలు ఉంటే యాజమాన్యాలు చూసుకోవాలి కాని అందులో పనిచేసే తమకు ఏం సంబంధం ఉంటుందని యాసిన్ పోలీసుల ముందు వాపోయారు.
నాణ్యమైన విత్తనం అందించాలి
అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం స్థానిక జస్వంత్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓలు రాకేష్‌నాయక్, శ్రీనాథ్‌రెడ్డి, ప్లాంట్ యజమాని రమణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉక్కపోత తగ్