అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ (రెగ్యులర్ లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్) ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత గురువారం ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 6,361 మంది పరీక్ష రాయగా, 6,270 (98.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏ కోర్సులో 346 మందికి గాను 339 మంది (97.98 శాతం), బీబీఏ కోర్సులో 530 మందికి గాను 521 (98.30 శాతం) మంది, బీసీఏలో 59 మందికి గాను 59 (100 శాతం) మంది, బీఎస్సీలో 1,809 మందికి 1,780 (98.40 శాతం), బీకాంలో 3,617 మందికి 3,571 (98.73 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలకు జ్ఞానభూమి పోర్టల్‌లో చూడాలని కోరారు.
వ్యవసాయ శాఖలో బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుజాత, సూపరింటెండెంట్ ప్రభాకర్ సమక్షంలో గురువారం ఉదయం డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (ఏఈఓ)కు కౌన్సెలింగ్ చేపట్టారు. ఇందులో 70 మందికి పైగా ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు. జాబితాలు కమిషనరేట్‌కు పంపుతామని అధికారులు తెలిపారు. ఈనెల 26న అనంతపురంలో జోనల్ స్థాయిలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల అధికారులు, ఉద్యోగులు హాజరవుతారన్నారు. అన్ని విభాగాలకు సంబంధించి జూన్ 2 లోపు బదిలీ ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు.
పశుశాఖలో 91 మందికి బదిలీలు
జూన్ 2 లోపు ఉత్తర్వులు
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖలో ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో 91 మందికి (ఉమ్మడి జిల్లావ్యాప్తంగా) స్థానచలనం ఉంటుందని ఆ శాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకట స్వామి తెలిపారు. వీరందరూ ఒకే చోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారన్నారు. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు, ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, 20 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ (పశువైద్యులు).. ఉండగా ఇరువురు వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్స్ (వీఎల్‌ఏ), 8 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్, 21 మంది లైవ్‌స్టాక్ అసిస్టెంట్స్, ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్స్, ఒకరు జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, మరో 23 మంది ఆఫీస్ సబార్డి నేట్స్ బదిలీ కానున్నట్లు తెలిపారు.వీరు కాకుండా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద మరికొందరు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లా, జోనల్‌స్థాయిలో పరిశీలన చేపట్టి జాబితాలు కమిషన రేట్‌కు పంపుతామన్నారు. జూన్ 2 లోపు బదిలీ ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు.
17 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 5.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరవకొండ 30.2 మి.మీ, బెళుగుప్ప 23.8, శెట్టూరు 18.2, కణేకల్లు 17, కళ్యాణదుర్గం 16.4, వజ్రకరూరు 16.2, ఆత్మకూరు 12 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే డీ. హీరేహాళ్, రాయదుర్గం, శింగనమల, బ్రహ్మసముద్రం, కంబదూరు, గుంతకల్లు, విడపనకల్లు, కూడేరు, గుమ్మఘట్ట, గార్లదిన్నె తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. శుక్రవారం కూడా జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాల విడుదల