
మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం
అనంతపురం: జిల్లాలో నకిలీ అక్రిడిటేషన్లు బయటపడ్డాయి. ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నకిలీ అక్రిడిటేషన్లను ఒక్కోక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ‘ప్రజాబలం–ప్రశ్నించే గళం’ పేరుతో మీడియా అక్రిడిటేషన్ కార్డు–2024ను డీఐపీఆర్వో గురుస్వామి శెట్టి గుర్తించి నిగ్గు తేల్చాలంటూ అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో అధికారికంగా చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రనాథయాదవ్ స్పష్టం చేశారు. కాగా, అసలైన అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 31తో ముగియనుంది. అయితే నకిలీ అక్రిడిటేషన్లు ఏకంగా 2026, జనవరి 1 చలామణిలో అయ్యేలా ముద్రించడం గమనార్హం. నేర చరిత ఉన్న వారు సైతం మీడియా ముసుగులో రిపోర్టర్లుగా చలామణి అయ్యేందుకు ఇలా నకిలీ అక్రిడిటేషన్లు సృష్టించి దందా సాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం
పెద్దపప్పూరు: మండలంలోని ఓ గ్రామంలో మతిస్థిమితం లేని మహిళపై సోమవారం స్థానికుడు అత్యాచారయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా పెట్నికోట గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని ఓ మహిళ తన తల్లితో కలిసి శుక్రవారం పెద్దపప్పూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న వారి బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం ఒంటరిగా ఉన్న ఆమైపె అదే గ్రామానికి చెందిన వీరాంజనేయులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ ఆ గ్రామానికి చేరుకుని బాధిత మహిళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.