
డిమాండ్లు నెరవేర్చమంటే బెదిరింపులా?
అపంతపురం మెడికల్: గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ)/ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్‌ఓ)ను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వారి న్యాయపరమైన డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా వేతనాలు నిలుపుదల చేయడంతో పాటు 9 నెలల ఇన్సెంటీవ్స్ బకాయిలనూ ఆపేసి పరోక్షంగా బెదిరింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ తీరుపై పలువురు ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రకాల సేవలు బంద్..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి వద్దకే సేవలందించేందుకు ప్రతి సచివాలయ పరిధిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీలు అన్ని రకాల సేవలు అందించేవారు. ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా ఇంటి వద్దకే వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంది. గర్భిణులకు నెలనెలా చెకప్‌లు, చెవి, ముక్కు గొంతు సమస్యలను గుర్తించి మందులు ఇవ్వడం అవసరమైతే హయ్యర్ సెంటర్‌కు రెఫర్ చేయడం, బాలింతలకు సేవలు, వయసు పైబడిన వారికి ఇంటి వద్దకే వెళ్లి సేవలందించడం, హెచ్‌బీ, ప్రెగ్నన్సీ, యూరిన్, బీపీ, మలేరియా, హెచ్‌ఐవీ, డెంగీ,విజువల్ ఇన్‌ఫెక్షన్(గర్భసంచి ముఖ ద్వారా కేన్సర్‌పరీక్ష), అయోడిన్ పరీక్ష, హెపటైటీస్ బీ, స్పుటమ్, సుఖ వ్యాధులు, తదితర 14 రకాల పరీక్షలు చేసేవారు. వైద్య నిపుణుల ద్వారా టెలీ మెడిసిన్ సేవలు అందించేవారు. దీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్, ఫిట్స్ గుండె, కిడ్నీ వ్యాధులకు మందులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని ఆయుష్మాన్ మందిర్‌లుగా మార్చడమే కాకుండా సేవలను గ్రామీణులకు దూరం చేస్తూ వచ్చింది.
న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా నిరవధిక సమ్మెలో
ఎంఎల్‌హెచ్‌పీలు
ఈ నెల వేతనంతో పాటు 9 నెలల ఇన్సెంటివ్‌ను ఆపిన ప్రభుత్వం
కూటమి సర్కార్ తీరుపై అసహనం