
కాలువ వెడల్పు పనులు వేగవంతం
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్ హౌస్ వద్ద నుంచి ఉరవకొండ మండలం కౌకుంట్ల, వై.రాంపురం మధ్యలో 211.8 కిలోమీటర్ వద్ద, బెళుగుప్ప మండలం జీడిపల్లి డ్యాం వద్ద ప్రధాన కాలువ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు పనులు నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ రాజాస్వరూప్‌కుమార్, ఆర్‌డీఓ వసంతబాబు, ఎస్‌ఆర్పీఎస్ శ్రీనివాస్, ఈఈలు శ్రీనివాసనాయక్, శ్రీనివాసులు, తహసీల్దార్ మహబూబ్‌బాషా, డీటీ నరేష్, డీఈఈ, జేఈలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.