పోలీసుల అత్యుత్సాహం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అత్యుత్సాహం

Apr 30 2025 1:52 AM | Updated on Apr 30 2025 1:52 AM

పోలీసుల అత్యుత్సాహం

పోలీసుల అత్యుత్సాహం

తాడిపత్రిటౌన్‌: నియోజకవర్గంలోని యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలీసుల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకెళితే.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం పుట్లూరు మండలం తిమ్మంపల్లి నుంచి యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ, విందులో పాల్గొనేందుకు మంగళవారం బయలుదేరారు. అయితే యాడికి మండలం భోగాలకట్ట వద్దకు రాగానే సీఐ రామసుబ్బయ్య పోలీసులతో వచ్చి పర్యటనను అడ్డుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి కండ్లగూడురులో జరిగే విందు కార్యక్రమానికి హాజరవుతున్నారని, మీరు వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాలతో అడ్డుకుంటున్నామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ వస్తే మాజీ ఎమ్మెల్యేను అడ్డుకుంటారా? ఎవరయ్యా మీకు చెప్పింది అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏఏ గ్రామాలకు వెళ్లకూడదో మీ పై అధికారులు ఏమైనా లిస్ట్‌ ఇచ్చారా.. ఉంటే చెబితే ఆ గ్రామాలకు వెళ్లనంటూ సీఐ రామసుబ్బయ్యతో ఆయన వాగ్వాదానికి దిగారు. దాదాపు గంట పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి, వెనక్కు తిప్పి పంపించారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement