
●మీ సేవలు అమూల్యం
అనంతపురం అర్బన్: ఉద్యోగులుగా ప్రభుత్వానికి, ప్రజలకు మీరు అందించిన సేవలు అమూల్యమని కలెక్టర్ వినోద్‌కుమార్ కొనియాడారు. వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణ చేసి అధికారులు, ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం తరఫున శనివారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరై ఉద్యోగ విరమణ చేసిన వారికి శాలువా కప్పి మొమెంటో, పూలమొక్క అందించి సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరూ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాక్షించారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు.