
గంజాయి మహమ్మారిని నిర్మూలిద్దాం
అనంతపురం: గంజాయి మహమ్మారి నిర్మూలనకు సమష్టిగా పనిచేద్దామని అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్జీఓలతో అడిషనల్ ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి గుర్తింపునకు డోర్ టు డోర్ సర్వే చేయాలన్నారు. పోలీస్, ఎకై ్సజ్, జిల్లా ఈగల్ సెల్, విద్యాశాఖ, గ్రామ, వార్డు సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సీఐలు హరినాథ్, వెంకటేశ్ నాయక్, జయపాల్ రెడ్డి, జిల్లా ఈగల్ సెల్ ఆర్‌ఎస్‌ఐ హనుమంతు తదితరులున్నారు.