
మొక్కజొన్న పంట దగ్దం
రాయదుర్గం టౌన్: మండలంలోని కదరంపల్లి గ్రామంలో రైతు కుమారస్వామి సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో శరవేగంగా మంటలు వ్యాపించి 9 ఎకరాల్లోని మొక్కజొన్న పంటను చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న రైతు స్థానికుల సాయంతో మంటలు అదుపు చేశారు. ఈ లోపు 5 ఎకరాల్లోని పంట పూర్తిగా కాలిపోయింది. మరో రెండు రోజుల్లో మొక్కజొన్న కంకులు కోయాల్సి ఉండగా ఈ ఘటన జరగడంతో రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు.
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్‌లో ఇద్దరికి చోటు
అనంతపురం అర్బన్: అఖిల భాతర కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తమిళనాడులోని నాగపట్నంలో మూడు రోజులుగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం కౌన్సిల్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు అన్నగిరి కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జునకు చోటు దక్కింది.

మొక్కజొన్న పంట దగ్దం