అనంతపురం సెంట్రల్: రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వెనుకబడిన ప్రాంతాలకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని సాగునీటి ఉద్యమ, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. అమరావతి ప్రయోజనమే రాష్ట్ర ప్రయోజనమనే విధంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన అనంతపురం జిల్లా ప్రయోజనాల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని, ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘జిల్లా ప్రాజెక్టులు– విభజన హామీలు’ అంశంపై అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న బీజీఆర్ ఫంక్షన్ హాల్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ అధ్యక్షతన ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సాగునీటి ఉద్యమ నాయకులు ఏమన్నారో... వారి మాటల్లోనే...
అమరావతి ప్రయోజనమే
రాష్ట్ర ప్రయోజనాలుగా భావిస్తున్న
సీఎం చంద్రబాబు
రాయలసీమ హక్కుల కోసం
ఐక్య ఉద్యమాలు చేపట్టాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో
రాజకీయ, ప్రజా సంఘాల,
సాగునీటి ఉద్యమ నాయకుల పిలుపు