కణేకల్లు/బొమ్మనహళ్: హెచ్చెల్సీ సిస్టమ్‌లో అత్యవసర పనులను ఈ నెలాఖరు కల్లా ప్రారంభించనున్నట్లు హెచ్చెల్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణరెడ్డి తెలిపారు. కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల పరిధిలోని హెచ్చెల్సీపై కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజన్ డీఈఈ మద్దిలేటితో కలసి శుక్రవారం ఆయన పర్యటించారు. 155 కి.మీ., 165 కి.మీ., 169 కి.మీ. వద్ద అర్థాంతరంగా ఆగిన బ్రిడ్జి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.33.89 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయన్నారు. 155, 165, 169 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరైనట్లు వివరించారు. అలాగే కణేకల్లు చెరువు పరిధిలో 3 స్లూయిస్‌లను రూ.22 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 147 కిలోమీటర్ వద్ద అవుట్ ఫాల్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ. 4.20 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. పీఏబీఆర్ రెగ్యులేటర్‌ను రూ.4.06 కోట్లు, ఎంపీఆర్ రెగ్యులేటర్‌ను రూ.4.07 కోట్లతో నిర్మిస్తున్నట్లు వివరించారు. మొత్తం రూ.33.89 కోట్ల పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ నిర్వహించి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లను పొందినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈఈలు అల్తాఫ్, నరేంద్రమారుతీ తదితరులు పాల్గొన్నారు.
హెచ్చెల్సీ ఈఈ వెంకటరమణరెడ్డి