ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

Mar 10 2025 10:53 AM | Updated on Mar 10 2025 10:49 AM

గుంతకల్లు: ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి అనంతపురం జిల్లా బాల, బాలికల కబడ్డీ జట్లను ఆదివారం గుంతకల్లులోని రైల్వే గ్రౌండ్‌లో ఎంపిక చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సెక్రటరీ లక్ష్మణ్‌, సెలక్షన్‌ కమిటీ సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. బాలికల విభాగంలో విష్ణు ప్రియ (అనంతపురం), వర్ష (ప్రసన్నాయపల్లి), నవ్యశ్రీ (తాడిపత్రి), సుచరిత (ఎస్కేయూ), జాను (చిన్మయనగర్‌), వర్షియా (తాడిపత్రి), హిమవతి (కొర్రపాడు), ప్రణతి (కూడేరు), షాజియా (ధర్మవరం) అనుశ్రీ (విడపనకల్లు), కీర్తన (ప్రసన్నాయపల్లి), తాడిపత్రికి చెందిన యజ్ఞ, నందిని చోటు దక్కించుకున్నారు. బాలురు విభాగానికి లోకేష్‌ (కౌకుంట్ల), మహమ్మద్‌ ఆసీఫ్‌ (ధర్మవరం), మహమ్మద్‌ ఉస్మాన్‌ (తాడిపత్రి), మల్లికార్జున (గుంతకల్లు), వరుణ్‌కుమార్‌ (బొమ్మనహళ్‌), పవన్‌కుమార్‌ (అనంతపురం), సునీల్‌ కుమార్‌ (గుంతకల్లు), చరణ్‌ (అనంతపురం), రాజు (అనంతపురం), వేణు (వైటీ చెరువు). హర్షవర్థన్‌ (తాడిపత్రి), ఏసురాజు (ధర్మవరం), విశ్వసందేష్‌ (అనంతపురం) ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement