అనంతపురం సిటీ: మహిళాభ్యున్నతితోనే మెరుగైన సమాజం నిర్మితమవుతుందని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్‌లో సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో కలసి శుక్రవారం ఆమె కేక్ కట్ చేసి, మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపి, మాట్లాడారు. అమ్మాయి, అబ్బాయిల పెంపకంలో వివక్ష చూపరాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం గర్వంగా ఉందన్నారు. బాలికలు విద్యావంతులైనప్పుడే సమాజంలో సమానత్వం పొందగలరన్నారు. ప్రతి అమ్మాయి స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో అమ్మాయిల చదువు ఆగిపోకూడదన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారులు షబ్బీర్‌నియాజ్, మహబూబ్ వలి, విజయ భాస్కర్‌రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, ధనుంజయ, కమ్మ నాగరాజు, ఉషారాణి, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం