గవిమఠం చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గవిమఠం చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Mar 5 2025 12:15 AM | Updated on Mar 5 2025 12:11 AM

ఉరవకొండ: ప్రసిద్ధి గాంచిన ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి ఆధ్వర్యంలో కంకణ ధారణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గవిమఠం ఆవరణం నుంచి గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. కంకణ మండపంలో కుండల్లో మట్టి వేసి నవధ్యానాలు ఉంచారు. బ్రహ్మోత్సవాలు ముగిసేలోపు మట్టికుండలో ధాన్యాలు బాగా పండితే పంటలు చేతికొచ్చి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కల్యాణ స్వామీజీ, గవిమఠం ఏజెంట్‌ రాజన్నగౌడ్‌ పాల్గొన్నారు.

రథోత్సవాన్ని విజయవంతం చేద్దాం

చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాన్ని విజయవంతం చేద్దామని గుంతకల్లు ఆర్‌డీఓ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 9న రథోత్సవం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు, పోలీసు భద్రత తదితర అంశాలపై ఉరవ కొండ తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆర్‌డీఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌, గవిమఠం మేనేజర్‌ కె.రాణి, తహసీల్దార్‌ మహబూబ్‌బాషా, ఎంపీడీఓ రవిప్రసాద్‌, అర్బన్‌ సీఐ మహానంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement