పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పటిష్ట బందోబస్తు

Jan 10 2025 12:36 AM | Updated on Jan 10 2025 12:36 AM

పటిష్

పటిష్ట బందోబస్తు

అనంతపురం: వైకుంఠ ఏకాదశి రోజైన శుక్రవారం జిల్లాలోని దేవాలయాల వద్ద పటిష్ట పోలీసు బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పి. జగదీష్‌ పేర్కొన్నారు. దేవాలయాలు, పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీకి అనుగుణంగా పోలీసు సిబ్బందిని కేటాయించామన్నారు. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు చేయాలని దేవాలయ కమిటీలకు సూచించామన్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే ఆలయాల వద్ద బ్యారికేడ్లు, క్యూ నిర్వహణ తప్పనిసరిగా పాటించాల న్నారు. దొంగతనాల కట్టడికి ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గస్తీ పెంచామని, మొబైల్‌ సెక్యూరిటీ హ్యాండ్‌ హోల్డ్‌ డివైజెస్‌ ద్వారా అనుమానితులను పరిశీలించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

నేడు మునిసిపల్‌ టీచర్లకు పదోన్నతులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: అనంతపురం కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మునిసిపాలిటీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పీఎస్‌హెచ్‌ఎం, పాఠశాల సహాయకుల (తెలుగు, హిందీ, ఉర్దూ) పోస్టుల భర్తీకి శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే తుది సీనియార్టీ జాబితాను డీఈఓ బ్లాగ్‌ https:// deoananthapuramu.blogspot.comలో ఉంచామన్నారు. సర్వీస్‌ రిజిస్టర్‌, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు డీఈఓ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.

సేంద్రియ ఎరువులతో

అధిక దిగుబడి

పెద్దవడుగూరు:సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడి సాధించవచ్చని హ్యాండ్‌లూమ్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీత, కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని మిడుతూరు గ్రామంలో దేశీ రకం పత్తి పంట సాగు పొలాలను వారు పరిశీలించారు. బీటీ పత్తి, నాన్‌ బీటీ పత్తి సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. దేశీ రకం పత్తి సాగుకు కేవలం జీవామృతం వాడుతున్నామని రైతులు తెలిపారు. అంతర పంట లుగా సజ్జ, అలసంద, కూరగాయలు సాగు చేసుకుంటున్నామన్నారు. రసాయన ఎరువులు వాడిన పత్తికి, జీవామృతం వాడిన పత్తికి చాలా వ్యత్యాసముంటుందన్నారు. దేశీ రకం పత్తి నాణ్యతగా ఉంటుందని, నాణ్యమైన కాటన్‌ దుస్తుల తయారీకి బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీపీఎం లక్ష్మానాయక్‌, తహసీల్దార్‌ ఉషారాణి, ఏఓ మల్లీశ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శిశువు మృతి

టీకా వికటించడంతోనే ప్రాణం పోయిందని తల్లిదండ్రుల ఆరోపణ

డీ హీరేహాళ్‌ (రాయదుర్గం): ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు మృతి చెందిన ఘటన డీ హీరేహాళ్‌ మండలం కూడ్లురులో విషాదం నింపింది. అయితే, టీకా వికటించడంతోనే బిడ్డ ప్రాణం పోయిందని తల్లిదండ్రులు ఆరోపించడంతో వైద్య సిబ్బందిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన భాస్కర్‌ భార్య రేణుక 8 నెలల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గురువారం ఉదయం శిశువుకు స్థానిక వైద్య సిబ్బంది టీకా వేశారు. ఈ క్రమంలోనే సాయంత్రం 4 గంటల సమయంలో శిశువు ఉన్నట్టుండి మృతి చెందింది. బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. టీకా వికటించడంతోనే కన్నుమూసిందని ఆరోపించారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. తమలా మరొకరు బిడ్డను కోల్పోకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

‘ప్రీమియం స్టోర్‌’ దరఖాస్తు గడువు పొడిగింపు

అనంతపురం: నగరంలో మద్యం ప్రీమియం స్టోర్‌ ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి బి. రామమోహన్‌ రెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుం రూ.15 లక్షలు (నాన్‌– రీఫండబుల్‌)గా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. రూ. కోటి లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా ఎకై ్సజ్‌ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

పటిష్ట బందోబస్తు 1
1/1

పటిష్ట బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement