
కూలి పనులతో జీవనం సాగిస్తున్న మేము ఏళ్ల తరబడి అద్దె ఇంట్లోనే నివాసమున్నాం. గతంలో ఎన్నికలు వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని రాజకీయ నాయకులు మా ఇళ్ల వద్దకు వచ్చి చెప్పి ఓట్లు వేయించుకున్నారు. గెలిచిన తర్వాత తిరిగి మా ఇళ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సంక్షేమ పథకాల లబ్ధి కూడా సక్రమంగా అందివ్వ లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వలంటీర్ మా ఇంటి వద్దకు వచ్చి వివరాలు తీసుకెళ్లి ఇంటి పట్టా తెచ్చిచ్చాడు. ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో సొంతింట్లోకి వెళుతున్నాం. మాకు మంచి చేసిన జగనన్నను జీవితాంతం మరువలేం. – కళావతి, కంబదూరు
రూ.1.36 లక్షల లబ్ధి చేకూరింది
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ పథకాల కింద మా కుటుంబానికి రూ.1.36 లక్షల లబ్ధి చేకూరింది. విద్యాదీవెన కింద రూ.62.320 లబ్ధి చేకూరడంతో మా కుమార్తె బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేయగలిగింది. మేము నివాసముంటున్న స్థలానికి హక్కు పత్రం ఇచ్చారు. సొంతిల్లు కూడా మంజూరు చేశారు. నా భర్త సుంకన్నకు ప్రతి నెలా రూ.2,750 పింఛన్‌ను వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నాడు. అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో రుణపడి ఉన్నాం.
– రామాంజినమ్మ, బేతాపల్లి, గుత్తి మండలం
రుణపడి ఉంటాం
మాకు సొంతిల్లు కట్టుకోవాలని ఎంతో కోరిక. అయితే పేదరికం కారణంగా ఇది సాధ్యం కాలేదు. గత పాలకుల ధోరణితో ఇక జీవితంలో సొంతిల్లు కట్టుకోలేమనుకున్నాం. జగన్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వలంటీర్ వచ్చి వివరాలు తీసుకెళ్లి ఇంటి పట్టా తెచ్చిచ్చాడు. అతేకాక ఇల్లు కూడా మంజూరు చేయడంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో సొంతింట్లోకి చేరుకుంటాం. మా చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – లక్ష్మీదేవి, మామడూరు,
బ్రహ్మసముద్రం మండలం
సొంతింటి కల నెరవేరింది
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న సొంతిల్లు కూడా సాధ్యమైంది. ఇంత కాలం ఉమ్మడి కుటుంబంలో ఇరుకు ఇంట్లోనే ఇబ్బంది పడుతూ వచ్చాం. మా సొంతింటి కలను సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేలును ఎన్నటికీ మరువలేం. – కొనేపల్లి పుష్పావతి,
కమ్మూరు, కూడేరు మండలం



