● ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. కొంతమంది బయటి వ్యక్తులు, మరికొందరు మీడియా పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే ఆత్మహత్యే శరణ్యం.
– నెల క్రితం సర్వజనాస్పత్రి క్యాజువాలిటీ డాక్టర్ జనార్దన్‌నాయక్ ఆవేదన
● మేము ఇక్కడ నిజాయితీగా పనిచేయాలని చూసినా చెయ్యనివ్వడం లేదు. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలు బయటి వ్యక్తులకు క్యాజువాలిటీలో ఏం పని ఉంది? మేము వాళ్లు చెప్పిన పని చెయ్యలేదంటే మీడియాలో రాస్తాం అంటూ బెదిరిస్తున్నారు.
– డాక్టర్ మాధురి ఆవేదన
‘ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వాళ్ల మాట వినకుంటే నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తావో మేమూ చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు. ఇలా ఉంటే మా ఉద్యోగం మేము చెయ్యలేకపోతున్నాం’ అంటూ డాక్టర్ శౌరిస్ రెండునెలల క్రితం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాజాగా డీఎస్పీ దృష్టికీ తీసుకెళ్లారు.