అనంతపురం: ఈ నెల 28న అండర్ – 14 బాల, బాలికల టెన్నిస్ బాల్ క్రికెట్ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చందన షైక్ అన్వర్ బాషా తెలిపారు. నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించే ఎంపికలకు క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. రూ.200 ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. ఎంపికై న వారు గుంటూరు జిల్లాలో అక్టోబరు 16, 17 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 6309430837, 6309715324 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.