అనంతపురం: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ), ఏపీఎస్‌ఎస్‌డీసీ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం, గుంతకల్లులో స్కిల్ హబ్‌ల్లో ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.గోవింద రాజులు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు లేదా ఫెయిలైన వారు 18 నుంచి 35 సంవత్సరాల్లోపు ఉన్న యువకులకు ఉచిత శిక్షణ ఇస్తామని, ఆసక్తి గల వారు ఈ నెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 990862306, 9032345188 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.