లక్ష్యానికి చేరువగా సీ్త్రనిధి రుణాల మంజూరు | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2023 12:58 AM

మాట్లాడుతున్న ఏజీఎం కామాక్షయ్య  - Sakshi

కూడేరు: ఉమ్మడి జిల్లాలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.310 కోట్ల సీ్త్ర నిధి రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటి వరకూ రూ.235 కోట్లను డ్వాక్రా మహిళలకు మంజూరు చేసినట్లు సీ్త్రనిధి ఏజీఎం కామాక్షయ్య తెలిపారు. కూడేరు మండలానికి సంబంధించి రూ.5 కోట్ల రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రూ.3.5 కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై మంగళవారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. వెనకబాటుకు కారణాలను ఏపీఎం, సీసీలు, యానిమేటర్లతో ఆరా తీశారు. ఈ నెలాఖరుకు నిర్దేశించిన లక్ష్యం నెరవేరాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు రూ.150 కోట్ల టార్గెట్‌కుగాను రూ.110 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.160 కోట్లకు గాను రూ.125 కోట్ల సీ్త్రనిధి రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 96 శాతం వసూళ్లు పక్కాగా జరిగాయన్నారు. సిబ్బంది అలసత్వం కారణంగా రూ.5 కోట్ల రుణాల వసూళ్లలో జాప్యం చోటు చేసుకుంటోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా మంజూరు చేసే ఈ రుణాలను సద్వినియోగం చేసుకునేలా మహిళా సంఘాలను చైతన్య పరచనున్నామన్నారు. రుణాల చెల్లింపు విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ నగదును సిబ్బంది చేతికి ఇవ్వరాదని, సంఘం ఖాతాల్లోకి నేరుగా జమ చేయడమో, ఫోన్‌పే ద్వారా జమ చేయడమో చేయాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బంది చేతికి నగదు అందజేస్తే అందుకు తగిన రసీదు తక్షణమే తీసుకోవాలన్నారు. సీ్త్రనిధి రుణం మంజూరు, వసూళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 మందిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు గుర్తు చేశారు.

ఉమ్మడి జిల్లా సీ్త్రనిధి ఏజీఎం కామాక్షయ్య

Advertisement
 
Advertisement
 
Advertisement