మాజీ ఎమ్మెల్యే గణేష్‌కు సంఘీభావం | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే గణేష్‌కు సంఘీభావం

May 2 2026 7:44 AM | Updated on May 2 2026 7:44 AM

నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే గొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సంఘీభావం తెలియజేశారు. గణేష్‌పై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా వ్యవహరించి, కారును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నర్సీపట్నంలోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను కలిశారు. వీరుతోపాటు వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు కలిసి సంఘీభావం తెలిపారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ వెన్నంటే ఉంటామని వారు భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement