పూర్వం నుంచి తమ ఆక్రమణలో ఉన్న పీడబ్ల్యూడీ భూమిలో పెంచుకున్న జీడిమామిడి, పనస చెట్లను దౌర్జన్యంగా నరికివేసి తన భూమిలోకి అక్రమంగా చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నించిన విషయమై తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, దీంతో ఆక్రమణదారులు రౌడీలతో తమపై దాడులకు దిగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించడంతో పాటు నా భూమిని రక్షించాలంటూ అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన భార్యభర్తలు కాండ్రేగుల సత్యవతి, సూర్యారావు ఫిర్యాదు చేశారు. చెట్ల నరికివేతపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కోరారు. – కాండ్రేగుల సూర్యారావు


