ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు చేపడుతున్న సీఐ అల్లు స్వామినాయుడు
కశింకోట: మండలంలోని తేగాడ గ్రామం వద్ద శారదా నదిలో బుధవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. తేగాడకు చెందిన గొంతిన లోవరాజు (60) కూలి పని కోసం గ్రామ సమీపంలోని నదిని నడిచి దాటడానికి అవతలకు వెళ్తుతుండగా మునిగిపోయి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందడంతో సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వృద్ధుడ ఆచూకీ దొరకలేదు. లోవరాజుకు భార్య సూర్యకాంతం, వివాహమైన కుమారుడు,కుమార్తె ఉన్నారు.


