చికెన్ సెంటర్‌లో మంటలు
మునగపాక: మండలంలోని తోటాడలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో చికెన్ షాపు దగ్ధమైంది. తోటాడ సెంటర్‌లో అనపర్తి లోవరాజు చికెన్ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. షాపులోని గ్యాస్ సిలిండల్ లీక్ కావడంతో మంటలు చెలరేగి షాపు కాలిపోయింది. ఈ ప్రమాదంలో విధ్యుత్ మీటర్‌తో పాటు కాటా, 20 కోళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30వేల ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.


