ఆలయాలను రక్షించుకునే బాధ్యత హిందువులదే.. | - | Sakshi
Sakshi News home page

ఆలయాలను రక్షించుకునే బాధ్యత హిందువులదే..

Mar 23 2026 8:25 AM | Updated on Mar 23 2026 8:25 AM

మాట్లాడుతున్న సుబ్బరాజు సమావేశానికి హాజరైన హిందువులు

అనకాపల్లి : రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, హిందూ దేవాలయాల భూములను పరిరక్షించుకునే బాధ్యత హిందువులకే అప్పగించాలని వక్త భూపతిరాజు సుబ్బరాజు అన్నారు. స్థానిక వివేకానంద పంక్షన్‌ హాల్లో విశ్వహిందూ పరిషత్‌–హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై ఆదివారం అవగాహన కార్యక్రమం వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డి.డి.నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలపై ప్రభుత్వ రాజకీయ నాయకుల పెత్తనం ఉండరాదని, హిందూ దేవాలయాల భూములను కాపాడవలసిన బాధ్యత హిందువులపై ఉందన్నారు. కార్యక్రమంలో స్వామీజీలు నరసింహాచారి, రాళ్లపల్లి పాపీశర్మ, డాక్టర్‌ విష్ణుమూర్తి, వీహెచ్‌సీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపేటి రామకొండలరావు, కటకం లక్ష్మణరావు, సహా కార్యదర్శి పీలా హేమ జగదీష్‌ నాయుడు, కోశాధికారి రమేష్‌, అనకాపల్లి అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, ప్రాంత తొలి సభ్యుడు శ్రీకాళహస్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement