పరిశ్రమలకు మరో 4,259 ఎకరాలు ? | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు మరో 4,259 ఎకరాలు ?

Mar 10 2026 7:26 AM | Updated on Mar 10 2026 7:26 AM

నాలుగు గ్రామాల్లో ల్యాండ్‌ బ్యాంకు సిద్ధం

ఈ భూములను పరిశీలించిన ముకేష్‌కుమార్‌ మీనా

గొలుగొండ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. విద్యార్థుల భవిష్కత్‌పై దృష్టి సారించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం తయారీ కోసం ప్రభుత్వం గ్యాస్‌పై భోజనం తయారు చేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు కాలేదు. ప్రభుత్వం అరకొర ఇచ్చే నిధులతో గ్యాస్‌ అనే పదం పక్కనపట్టి కేవలం కర్రలపై వంటలు తయారు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం భోజనం తయారీకి సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నిబంధనలు ఇలా..

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్యాస్‌ వినియోగించి మధ్యాహ్న భోజనం తయారు చేయాలి.

విద్యార్థులకు సకాలంలో భోజనం తయారు చేయించి వడ్డించే విధంగా ఉపాద్యాయులు చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లా పరిధిలో ఈ విధానం 60శాతం వరకు అమలు కాలేదు. గ్యాస్‌తో భోజనం తయారు చేయడం వల్ల నిర్వాహకులకు గిట్టుబాటు లేదని ఉద్దేశ్యంతో కర్రెలతో వంటలు చేస్తున్నా విద్యాశాఖ చోద్యం చూస్తోంది.

విద్యారంగంపై చిన్నచూపు

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి భోజనం పెడుతున్నారు. ప్రతి విద్యార్థికి ప్రతి రోజు బియ్యం, గుడ్డు కాకుండా నిర్వాహకులకు ఇచ్చేది కేవలం 9.18పైసలు మాత్రమే. ఈ డబ్బుతో కూర, చారుతో పాటు వంట తయారు చేయాలి.

రుచి లేని భోజనం

ప్రతి పాఠశాలకు ఆనుకొనే వంటశాలలు ఉంటాయి. విద్యార్థులకు మద్యాహ్న భోజనం తయారీ పాఠశాలలకు ఆనుకొని చేపట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్రలతో వంటలు తయారు చేయడం వల్ల పొగ పాఠశాలలో వ్యాపిస్తోంది. కట్టెలు ఉపయోగించి వంట చేయడం వల్ల పొగ వ్యాపించి విద్యార్థులకు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి రుచికరమైన భోజనం కూడా అందడం లేదు. రుచి లేక విద్యార్థులు అన్నం తినలేని పరిస్థితులు చాలా సందర్భాలు ఉన్నాయి. కర్రలు సరిగా కాలక సమయంలో పొగ అధికంగా రావడం వల్ల భోజనం రుచి లేకుండా పోతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పాఠశాలల్లో ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్‌, స్టౌలు 60 శాతం వరకు మూలకు చేరడం జరిగింది.

వంట కోసం పెద్ద పెద్ద చెట్లు నరికి వంటశాల వద్ద వేసిన దృశ్యం, (ఇన్‌సెట్‌) కొత్తమల్లంపేట ప్రాథమిక పాఠశాలలో కర్రలపై వంటలు చేస్తున్న దృశ్యం

మాకవరపాలెం : మండలంలో మరో 4,259 ఎకరాలను పరిశ్రమలకు కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్‌లో 406 ఎకరాలతోపాటు ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న మరో 290 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పెద్దిపాలెం, పైడిపాల, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూ గ్రామాల పరిధిలో పరిశ్రమల స్థాపనకు 4,259 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకును రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో సుమారు 3000 ఎకరాలు డీ పట్టా భూములే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర భూగర్భ గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సోమవారం పర్యటించారు. పైడిపాల, పాపయ్యపాలెం ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు. నాలుగు గ్రామాలకు సంబంధించి భూముల వివరాలతో కూడిన మ్యాపులను పరిశీలించి, పరిశ్రమలకు కేటాయిస్తే రవాణా, నీటి సౌకర్యాలపై ముఖేష్‌కుమార్‌ మీనా ఆరా తీశారు. వీటికి సంబంధించిన వివరాలను యువరాజ్‌తో పాటు కలెక్టర్‌ వివరించారు.

జాతీయ రహదారితో అనుసంధానం...

రాచపల్లి ప్రాంతంలో ఏర్పాటు కానునున్న పారిశ్రామిక కారిడార్‌కు జాతీయ రహదారితో అనుసంధానం చేయనున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఇప్పటికే రాచపల్లి వద్ద డోజ్కో కంపెనీకి ప్రభుత్వం 150 ఎకరాలను కేటాయించింది.

ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, మాస్టర్‌ప్లాన్‌ను గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌ సోమవారం కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్‌ ముజీబ్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

చర్యలు తీసుకుంటాం

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం గ్యాస్‌పైనే తయారు చేయాలి. ఇప్పటికే కట్టెలపై భోజనం తయారు చేసే వారిపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నాం. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కట్టెలపై భోజనం తయారు చేయించవద్దని ఎంఈవోలకు చెప్పడం జరిగింది. ఇకపై కట్టెలపై మధ్యాహ్న భోజనం తయారు చేసినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం

గిడ్డు అప్పారావు నాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి, అనకాపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement