ఆటోలో 17 మంది విద్యార్థుల ప్రయాణం
● దింపేసి బస్సుల్లో పంపించిన పోలీసులు
ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ మురళి
నక్కపల్లి: పరిమితికి మించి 17 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆటోను నక్కపల్లి పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం వేంపాడు టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా.. పాయకరావుపేట నుంచి నక్కపల్లి వైపు 17 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆటోను సీఐ జూరెడ్డి మురళి గుర్తించారు. ఆటో నుంచి విద్యార్థులను దింపేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. చదువుకుంటున్న మీరు కూడా ఇంత మంది ఒకే ఆటోలో ప్రయాణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించి తీసుకెళ్తే కేసులు నమోదు చేసి ఆటోలను సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు.


