లేబర్ కోడ్స్‌తో శ్రమ దోపిడీ
మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు
రావికమతం: లేబర్స్ కోడ్స్‌తో శ్రామిక మహిళలు దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. సీఐటీయూ మండల కన్వీనర్ వి. సత్యవతి అధ్యక్షతన రావికమతంలో కార్మికులుతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా వచ్చే నెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. లేబర్ కోడ్స్‌తో కార్మిక చట్టాలు రద్దయ్యాయన్నారు. యాజమాన్యాలకు మేలు చేసేందుకు కార్మికులకు రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందన్నారు. అంగన్‌వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి సత్యవేణి, ఆశ యూనియన్ సభ్యులు కె. దేవి, మధ్యాహ్న భోజన పథకం మండల అధ్యక్షురాలు అమ్మాజీ, ముఠా కార్మికుల అధ్యక్షులు దానయ్య, ఆటో కార్మికుల నాయుకుడు దండి శ్రీను, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


