స్క్రాప్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధం
కశింకోట: ఏపీఈపీడీసీఎల్ డివిజన్ నడుస్తున్న కశింకోటలోని ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో స్క్రాప్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. శుభ్రతలో భాగంగా ఎండు ఆకులు, చెత్తను పోగు చేసి నిప్పు పెట్టడంతో ఒక చోట ఉన్న స్క్రాప్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఆయిల్ లీక్ కావడంతో దానికి మంటలు అంటుకొని వ్యాపించి కాలిపోయాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు స్క్రాప్ అని ఏపీఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు.


