కోడి పందాల శిబిరాలపై దాడి | - | Sakshi
Sakshi News home page

కోడి పందాల శిబిరాలపై దాడి

Jan 26 2026 4:41 AM | Updated on Jan 26 2026 4:41 AM

కోడి పందాల శిబిరాలపై దాడి

కోడి పందాల శిబిరాలపై దాడి

కోడి పందాలరాయుళ్లతో రావికమతం ఎస్‌ఐ రఘువర్మ, పోలీసు సిబ్బంది

రావికమతం: మండలంలో దిడ్డి గ్రామంలో కోడి పందాలు శిబిరంపై ఆదివారం ఎస్‌ఐ రఘువర్మ పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కోళ్లు , రూ.1680 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామని ఎస్‌ఐ తెలిపారు. పండగలు, తీర్థాలు సందర్భంగా కోడి పందాలు, జూదం, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement