గొడ్డు మాంసం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు
మునగపాక: మండలంలోని నాగులాపల్లిలో గొడ్డు మాంసం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. నాగులాపల్లి లో పశువులను కోసి మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం తన సిబ్బందితో కలిసి దాడి చేసినట్టు చెప్పారు. ఈ దాడిలో గొడ్డు మాంసం విక్రయిస్తున్న డొక్కా బొంగురాజు, డొక్కా రమణ,పెదపూడి సింహాచలంలను పట్టుకుని, వారి నుంచి 59 కిలోల గొడ్డు మాంసం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గొడ్డు మాంసాన్ని పశు వైద్యాధికారి సమక్షంలో పరిశీలన చేసి గొయ్యి తీసి ఖననం చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


