చోడవరం మండలం వెంకన్నపాలెం ఎంపీపీ స్కూల్లో జిప్‌లు పనిచే
60 శాతానికి పైగా చిరిగిపోయాయి..
జిల్లాలో మొత్తం 1446 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1099 ప్రైమరీ, 62 ఎంపీయూపీ, 285 హైస్కూల్స్ ఉన్నాయి. జిల్లాలో 2,07,370 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 96,807 మందికి ఈ విద్యా సంవత్సరంలో బ్యాగులు ఇవ్వాలని ఇండెంట్ పెట్టి విద్యా శాఖ అధికారులు సరకు రప్పించారు. కానీ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చిరిగిన, కుట్లు పోయిన వాటిని రిటర్న్ పంపించాలని, వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని చెప్పారు. కానీ ఆచరణలో జరగలేదు. దీంతో చాలా మంది హెచ్‌ఎంలు యాప్‌లో బ్యాగ్‌లను రిటర్న్ చేసేందుకు వివరాలు నమోదు చేశారు. అయితే ఇందులో బ్యాగ్ మొత్తం పనికిరాకుండా ఉంటేనే వెనక్కి తీసుకుని కొత్తది ఇస్తామని విద్యాశాఖ అధికారులు మెలిక పెట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో షాపుల్లో డబ్బులు వెచ్చించి కొనుక్కున్న బ్యాగులనే విద్యార్థులు వాడుతున్నారు. ఆరు నెలల్లోనే 60 శాతానికి పైగా బ్యాగులు చిరిగిపోయాయి.


