అంతా డొల్లే..
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లలో
ప్రభుత్వ వైఫల్యం
కుర్చీల్లేక వెనుదిరిగిన వీఐపీలు
అతిథులకు చేదు అనుభవం
తొలిరోజు సదస్సు అట్టర్‌ఫ్లాప్
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులతో మేనేజ్
ప్రభుత్వంతో చర్చలకు
52 మందితో కమిటీ
జాబితా అందజేసిన మత్స్యకారులు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా రెండు నెలలుగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. 52 మందితో కమిటీ ఏర్పాటు చేసి ఈ జాబితాను శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు చేతుల మీదుగా నర్సీపట్నం ఆర్డీవోకు అందజేశారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. చర్చల కోసం వచ్చిన హోం మంత్రిని అడ్డుకోవడం, జాతీయ రహదారి ముట్టడి వంటి ఆందోళనలు చేశారు. వీరితో కలెక్టర్ చర్చలు జరిపారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేయగా.. ఈ వ్యవహారం తన పరిధిలో లేదని కలెక్టర్ చేతులెత్తేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గ్రామస్తులంతా కమిటీగా ఏర్పడి వస్తే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని, మీరే స్వయంగా సీఎంకు డిమాండ్లు చెప్పుకోవచ్చని సూచించారు. రెండు నెలలుగా చేస్తున్న పోరాటం ఒక కొలిక్కి రాకపోవడం, బల్క్ డ్రగ్ పార్క్ రద్దు వ్యవహారం సీఎం స్థాయిలో ఉండటంతో మత్స్యకారులంతా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. 52 మందితో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ జాబితా ఆర్డీవోకు ఇవ్వడంతోపాటు వీరందరినీ సీఎం దగ్గరకు తీసుకెళ్లే బాధ్యత అధికారులే తీసుకోవాలని కోరారు. మత్స్యకారుల ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉంటున్న వైఎస్సార్‌సీపీ నాయకుల ద్వారా జాబితా ఆర్డీవోకు అందజేశారు. ఆర్డీవో వి.వి.రమణ మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలకు మత్స్యకారులు అంగీకరించారని, సీఎం వద్దకు వచ్చేవారితో కూడిన జాబితా తమకు అందజేశారన్నారు. ఈ జాబితాను హోం మంత్రి ద్వారా సీఎంకు పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తేదీని మత్స్యకారులకు తెలియజేస్తామన్నారు.
ప్లీనరీ సెషన్లలో యూనివర్సిటీల విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: ప్రచారం ప్రపంచాన్ని దాటేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. పారిశ్రామికవేత్తలు ఉండాల్సిన స్థానాల్లో విద్యార్థులను కూర్చోబెట్టి సెషన్లను ‘మేనేజ్’ చేసేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే సెషన్లలో వక్తలుగా.. టీడీపీ నేతలే ఒప్పందాలు చేసుకున్న డెలిగేట్స్‌గా వ్యవహరించారు. ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్లుగా పాత ఒప్పందాలనే కొత్తగా చూపిస్తూ.. క్రెడిట్ చోరీలో సాటిలేని చంద్రబాబు సమర్పించిన భాగస్వామ్య సదస్సు సినిమా తొలిరోజు అట్టర్‌ఫ్లాప్ అయింది. ముఖ్యంగా, ప్రారంభోత్సవ ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
కుర్చీలు లేక వీఐపీల అవస్థలు
ఉదయం 8.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించినా, 9.30 గంటల వరకు సభా ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద గీతం, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులను ప్లీనరీ హాళ్లకు, ప్రధాన సభా ప్రాంగణానికి తరలించారు. పారిశ్రామికవేత్తల స్థానాల్లో విద్యార్థులే కనిపించడంతో, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య అతిథులు సైతం ఆశ్చర్యపోయారు. కేవలం ప్రచార పటాటోపం తప్ప.. భాగస్వామ్య సదస్సు అంతా సినిమా షో అని కీలక వ్యక్తులకూ అర్థమైపోయింది. ఇంతలో సభ ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు చేదు అనుభవం ఎదురైంది. వారంతా అక్కడికి చేరుకునే సరికి కుర్చీలు దొరకలేదు. ఎక్కడ కూర్చోవాలో తెలీక కాసేపు నిలబడాల్సి వచ్చింది. ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లు చేశామని చంద్రబాబు చెప్పిన మాటలకు.. అక్కడ పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో వారు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.
నేటితో ముగియనున్న సదస్సు
భాగస్వామ్య సదస్సు శనివారం రాత్రితో ముగియనుంది. రెండో రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు వివిధ ప్లీనరీ హాల్స్‌లో పలు సెషన్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 మధ్య ప్రధాన వేదిక ప్రాంగణం హాల్ నంబరు–7లో పరిశ్రమల శాఖ 27, పర్యాటక శాఖ 21, ఐటీ శాఖ 7, చేనేత–జౌళీ శాఖ 2 ఎంవోయూలను కుదుర్చుకోనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుకలు ప్రధాన వేదికై న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్–5లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.యల్ల, సీఐఐ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.దినేష్ తదితరులు హాజరుకానున్నారు.
చంద్రబాబు మాట్లాడే సమయానికి ఖాళీగా దర్శనమిచ్చిన ప్రధాన సభా ప్రాంగణం
వేదికని కుదించేశారు
చాలా సేపు ఓపికగా కూర్చున్న విద్యార్థులు సైతం సహనం కోల్పోయి, ప్లీనరీ సమయానికి వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం మొదలయ్యే సమయానికి ప్రధాన వేదిక ప్రాంగణం దాదాపు ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ పరిణామంతో మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చేసేదేమీ లేక, అధికారులు సభా ప్రాంగణాన్ని కుదించేశారు. అక్కడక్కడా కూర్చున్న వారిని ముందుకు పంపించి, ఖాళీలను కప్పిపుచ్చారు. వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఐటీ, టూరిజం, పరిశ్రమలు, ఆసుపత్రుల రంగాల ఉద్యోగులతో ప్రాంగణాన్ని నింపేందుకు యత్నించారు. అయినా వందల కుర్చీలు ఖాళీగా కనిపించడంతో, చివరికి ప్రధాన ప్రాంగణానికి పార్టిషన్ వేసి వేదికను కుదించేశారు.
మంత్రుల అనుచరులే సెషన్ల వక్తలు.!
ఇక ప్లీనరీ సెషన్ల విషయంలోనూ ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప, అవి క్షేత్రస్థాయిలో విజయవంతం కాలేదు. వివిధ సెషన్లలో నిపుణులకు బదులుగా, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన పారిశ్రామిక నేపథ్యం ఉన్న అనుచరులే వక్తలుగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ సెషన్లలోనూ ప్రతినిధులెవరూ పాల్గొనకపోవడంతో, ఏయూ విద్యార్థులను హడావిడిగా తీసుకొచ్చి హాళ్లను నింపేశారు. మొత్తంగా తొలి రోజు సదస్సు ప్రచారంలో ఉన్నంత ఏమీ లేదనీ.. అంతా డొల్లేనని తేలిపోయింది.
అంతా డొల్లే..
అంతా డొల్లే..
అంతా డొల్లే..
అంతా డొల్లే..
అంతా డొల్లే..


