మురిపించిన బుజ్జాయిలు
భరతమాత వేషధారణలో..
నర్సింహావతావరంలో..
గోవర్ధన గిరిధారి..
నర్సీపట్నం: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఆర్‌టీయూ నిర్వహించిన బాలల ప్రతిభా పాటవ పోటీలు ఆకట్టుకున్నాయి. గురువారం విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. భరతమాత, గౌతమ బుద్ధుడు, పరమశివుడు, శ్రీకృష్ణుడు, నర్సింహావతారం వంటి వివిధ వేషాల్లో బాలలు అలరించారు. ఈ పోటీల్లో విజేతలకు శుక్రవారం జరిగే బాలల దినోత్సవ కా ర్యక్రమంలో బహుమతులు అందజేస్తామని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ తెలిపారు.
మురిపించిన బుజ్జాయిలు
మురిపించిన బుజ్జాయిలు


