మంచినీటి ట్యాంకు నాణ్యతా లోపంపై విచారణ
8లో
ఎస్.రాయవరం: పెట్టుగోళ్లపల్లి గ్రామంలో జల్‌జీవన్ మిషన్ పథకం కింద నిర్మించిన వాటర్ ట్యాంకు నాణ్యతా లోపంపై ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ ఇషాన్‌బాషా సమక్షంలో ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు, క్యాలిటీ కంట్రోల్ అధికారులు గురువారం విచారణ చేపట్టారు. నాణ్యత లోపంపై గ్రామస్తులు ప్రశ్నించడంతో హోంమంత్రి అనిత బుధవారం ఈ ట్యాంకును ప్రారంభించకుండా వెళ్లిపోయారు. ఈ మేరకు అధికారులు విచారణ కోసం గ్రామానికి వచ్చి ట్యాంకు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ రికార్డులు, ఖర్చు చేసిన నిధులు వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకు లీకులను మూడు రోజుల వ్యవధిలో సరి చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతామన్నారు.
డీఈ, ఏఈ సస్పెన్షన్!
ట్యాంకు నిర్మాణంలో నాణ్యతా లోపం వల్ల లీకులు ఏర్పడటంతో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, ఏఈ మనోజ్ కళ్యాణ్‌లను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
జల్ జీవన్ మిషన్ పనుల్లో
నాణ్యత లోపం.!


