టెన్త్ పరీక్ష కేంద్రాల్లో వసతులపై ఆరా
నాతవరం: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎ.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆయన మండల కేంద్రం నాతవరంలోని హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించే గదులను గురువారం పరిశీలించారు. గదుల్లో ఫ్యాన్‌లు, తాగునీరు, డెస్క్‌లు, తదితర సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో వసతులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా పాఠశాలలను పరిశీలించామని, పలు చోట్ల సదుపాయాల కల్పనపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. నాతవరం మండలంలోని పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ సిహెచ్.సత్యనారాయణ, ఎంఈవోలు ఎస్.బ్రహ్మాజీ, కామిరెడ్డి వరహాలబాబు, నాతవరం హైస్కూల్ హెచ్‌ఎం కూండ్రపు సత్యనారాయణ పాల్గొన్నారు.


