డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు
తుమ్మపాల: ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన కార్యక్రమంలో భాగంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా రవాణా శాఖాధికారి జి.మనోహర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం చొప్పున మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీపీఆర్ నకలతో పాటు ఇతర అటాచ్‌మెంట్లను స్థానిక జిల్లా రవాణా శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. నిర్వాహకులు ఎన్జీవో, ట్రస్ట్, కో–ఆపరేటివ్ సొసైటీ, ఫర్మ్ అయి ఉండాలన్నారు. గత మూడు సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్స్, టర్నోవర్ సర్టిఫికెట్స్ అందించాలని పేర్కొన్నారు. రెండెకరాల స్థలం, సిమ్యూలేటర్, ట్రైనింగ్ వాహనాలు, వర్క్‌షాప్, క్లాస్ రూమ్స్, ఇంటర్నెట్ సదుపాయాలు ఉండాలని ఆయన సూచించారు.


