చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం

Nov 14 2025 6:10 AM | Updated on Nov 14 2025 6:10 AM

చిన్న

చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం

మిగతా 8వ పేజీలో

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మరణించినా దిక్కూమొక్కూలేని వైనం

డావెన్సీ అంతర్జాతీయ స్కూల్‌ యాజమాన్యం తీరుపై నిరసన

నీట మునిగి ఒకటో తరగతి విద్యార్థి మృతి

స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే విగతజీవిగా ఉన్నా పట్టించుకునే నాథులు కరువు

ఆగ్రహంతో ఊగిపోయిన బాధిత కుటుంబం

యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలంటూ రాస్తారోకో

స్కూల్‌ డైరెక్టర్‌ రమణాజీ జనసేన నేత

మునగపాక: అభం శుభం తెలియని చిన్నారి స్విమ్మింగ్‌ పూల్‌లో మృతి చెందడంతో తిమ్మరాజుపేటలోని డావెన్సీ అంతర్జాతీయ స్కూల్‌ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. స్కూల్‌లో ఒకటో తరగతి చదువుకుంటున్న తమ బిడ్డ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. పూడిమడక రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. చిన్నారులందరూ బాలల దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. వివరాలు.. యలమంచిలి ధర్మవరం ప్రాంతానికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు జమ్మూలో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీనివాసరావు, శ్రీలత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రశాంత్‌ మునగపాక మండలం తిమ్మరాజుపేట డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు మోక్షిత్‌ సందీప్‌ (8) అదే స్కూల్లో ఒకటో తరగతి చదువుకుంటున్నాడు. ఎప్పటిలాగా వీరిద్దరూ యలమంచిలి ధర్మవరం నుంచి బస్సులో బయలుదేరి స్కూల్‌కు వచ్చారు. మధ్యాహ్నం సందీప్‌ స్కూల్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌కు వెళ్లాడు. తరగతులు అయ్యాక స్కూలు బస్సు ఎక్కిన ప్రశాంత్‌ కొంత దూరం వెళ్లాక తమ్ముడు సందీప్‌ రాలేదని గుర్తించాడు. కంగారు పడి వెంటనే ఆ విషయం చెప్పినా బస్సు డ్రైవర్‌ పట్టించుకోలేదు. ధర్మవరానికి బస్సును తీసుకువచ్చేశాడు. ఇంటికి వెళ్లిన ప్రశాంత్‌ తన తల్లితో తమ్ముడు సందీప్‌ బస్సులో రాలేదని చెప్పడంతో కంగారుపడ్డ శ్రీలత స్కూల్‌ యాజమాన్యానికి ఫోన్‌ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో తన బంధువులతో కలిసి స్కూల్‌కు వచ్చి సందీప్‌ కోసం వెతకడం ప్రారంభించారు. స్కూల్‌ ఆవరణలోని స్విమ్మింగ్‌ పూల్‌లో విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. అప్పటికే సందీప్‌ మృతి చెంది ఉండడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న

చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం 1
1/2

చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం

చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం 2
2/2

చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement