పెద్దేరులో యువకుడు గల్లంతు
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది పెద్దేరు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వడ్డాది మేదర వీధికి చెందిన మొగ్గ నాగ అప్పారావు గ్రామంలో ఉన్న పెద్దేరు నదిలో చేపలు పట్టడానికి మంగళవారం వెళ్లాడు. చేపల కోసం వెళ్లిన నాగ అప్పారావు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం బుచ్చెయ్యపేట పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చెయ్యపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు గజ ఈతగాళ్లు, తమ సిబ్బందితో పెద్దేరు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు నాగ అప్పారావు కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.


