పీఎం ఆవాస్ యోజన మంజూరు పత్రాల పంపిణీ
అనకాపల్లి టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొని, సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధిదారులకు బుధవారం పత్రాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఒక లబ్ధిదారుడు కట్టిన ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద, మళ్ల సురేంద్ర, ఆర్డీవో షేక్ ఆయిషా, జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఏఈలు పింకీ, మురళి తదితరులు పాల్గొన్నారు.


