బాక్సింగ్ పోటీల్లో ఇద్దరు విద్యార్థులకు బంగారు పతకాలు
నర్సీపట్నం: ఆంధ్ర యూనివర్సిటీలో ఈ నెల 11న నిర్వహించిన ఇంటర్ కాలేజీ బాక్సింగ్ సెలక్షన్స్ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన ఇద్దరు ఉమెన్ బాక్సర్లు బంగారు పతకాలు సాధించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న బొంతు మౌనిక 75 కేజీల విభాగం, ఎబీఎం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఏడిద లక్ష్మీ తేజస్విని 81 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారని కోచ్ అబ్బు తెలిపారు. వచ్చే నెల పంజాబ్‌లో జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్‌కు సెలెక్ట్ అయ్యారని ఆయన చెప్పారు. వీరిని ఏపీ బాక్సింగ్ ప్రెసిడెంట్ ఐ.వెంకటేశ్వరరావు, నింజాస్ అకాడమీ డైరెక్టర్ సుతాపల్లి శ్రీకాంత్ అభినందించారు.
బాక్సింగ్ పోటీల్లో ఇద్దరు విద్యార్థులకు బంగారు పతకాలు


