జీవీఎంసీ టెండర్ల విచిత్రం
సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ చేపట్టిన పనులకు సంబంధించి టెండర్లలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సుకు ముందుగానే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ అధికారులు విచిత్రంగా కొన్ని పనులకు సంబంధించి బుధవారం షార్ట్ టెండర్లను ఆహ్వానించడం విశేషం. ఏయూలో పార్కింగ్ కోసం భాస్కర్, న్యూటన్, సమతా హాస్టల్స్ వద్ద మైదానాలను లెవెలింగ్‌కు, మద్దిపాలెంలో ఏయూ ఎంట్రన్స్ ఆర్చ్ వద్ద ఫుట్‌పాత్ టైల్స్, కెర్బ్‌వాల్ మరమ్మతులు, ట్రాఫిక్ ఐల్యాండ్ మ్యూరల్ ఆర్ట్స్ పెయింటింగ్... ఇలా పనులకు షార్ట్ టెండర్లు పిలిచారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. 15 తేదీ సాయంత్రానికి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ముగుస్తుంది. అప్పుడు టెండర్లు ఖరారు చేసి సదస్సుకు సుందరీకరణ పనులు చేపడ్డమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.


